Gautam Ghambhir: ఇక చాలు... పాక్ తో యుద్ధానికి కదలండి: గౌతమ్ గంభీర్

  • కబుర్లు చెప్పడం ఆపేద్దాం
  • పాకిస్థాన్ తో సంభాషణ యుద్ధ మైదానంలో సాగాలి
  • ట్విట్టర్ లో గౌతమ్ గంభీర్

కబుర్లు చెప్పడం ఆపి, పాకిస్థాన్ తో యుద్ధం చేసేందుకు కదలాలని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన, ట్విట్టర్ వేదికగా తనలోని ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇక మాటల్లేవని, యుద్ధమే ఉగ్రవాద సమస్యకు పరిష్కారమని అన్నారు. వేర్పాటు వాదులను ఉపేక్షిస్తుంటే ఇలాంటి ఘటనలే పునరావృతమవుతుంటాయని హెచ్చరించిన గంభీర్, పాక్ తో యుద్ధం చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

"ఇక జరిగింది చాలు. వెంటనే వేర్పాటువాదులు, పాకిస్తాన్‌తో మాట్లాడనివ్వండి. కానీ ఈ సంభాషణ అనేది గదుల్లో కా‍కుండా.. యుద్ధ మైదానంలో ఉండాలి" అని ట్వీట్ చేశారు. గంభీర్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుండగా, ఆయనకు మద్దతు పలుకుతూ, యుద్ధానికి దిగాల్సిందేనని స్పందిస్తున్నారు నెటిజన్లు.

Gautam Ghambhir
Pakistan
India
War
  • Loading...

More Telugu News