Telangana: తెలంగాణలో జోరు పెంచిన కాంగ్రెస్.. ఈ నెల 17న ఎన్నికల కమిటీ భేటీ!

  • చేవెళ్ల, మల్కాజిగిరిలో సమీక్షా సమావేశాలు
  • ఆదివారం గచ్చిబౌలి ఎల్లా హోటల్ లో భేటీ
  • హాజరు కానున్న ఇన్ చార్జి కుంతియా 

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ జోరు పెంచింది. ఇందులో భాగంగా ఈ నెల 17న ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ లో చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంటరీ పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించనుంది. ఈ విషయాన్ని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

పార్లమెంటరీ సమీక్షా సమావేశాలకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు సలీమ్ అహ్మద్, బోసురాజు, శ్రీనివాసన్ తదితరులు హాజరవుతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్లా హోటల్ లో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

Telangana
parliament
elections
elections committee meeting
  • Loading...

More Telugu News