kcr: జవాన్లపై దాడి ఘటన: తీవ్రంగా కలత చెందిన కేసీఆర్.. పుట్టినరోజు జరుపుకోరాదని నిర్ణయం

  • సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడిని ఖండించిన కేసీఆర్
  • అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీఎం
  • తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించవద్దని పార్టీ శ్రేణులకు పిలుపు

కశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ముష్కరులు జరిపిన దాడిలో అనేక మంది జవాన్లు మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా విషాదంలో మునిగిపోయిందని, తాను కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈనెల 17న తను పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపుకోరాదని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించవద్దని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు సూచించారు.

kcr
birthday
crpf
terrorist
attack
TRS
  • Loading...

More Telugu News