Jammu And Kashmir: నేటి అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్న నరేంద్ర మోదీ, రాజ్ నాథ్ సింగ్!

  • అవంతిపుర సమీపంలో భీకర ఉగ్రదాడి
  • అపాయింట్ మెంట్లను రద్దు చేసుకున్న ప్రధాని
  • కాసేపట్లో శ్రీనగర్ కు రాజ్ నాథ్ సింగ్

శ్రీనగర్ కు 20 కిలోమీటర్ల దూరంలోని అవంతిపుర సమీపంలో భారత జవాన్ల కాన్వాయ్ పై జరిగిన భీకర ఉగ్రదాడి దేశాన్ని కుదిపేస్తున్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు నేటి తమ అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని, ఢిల్లీలోనే ఉండి పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించారు. ముందుగా ఇచ్చిన అపాయింట్ మెంట్లను రద్దు చేసినట్టు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

మరోపక్క, తన యూపీ పర్యటనను వాయిదా వేసుకున్న రాజ్ నాథ్, ప్రస్తుతం హోమ్ శాఖ కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహిస్తున్నారు. సమావేశం ముగియగానే శ్రీనగర్ కు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ సైనికులను కలిసి, వారితో చర్చించనున్నారు. శ్రీనగర్ కు బయలుదేరి వెళ్లే ముందు నరేంద్ర మోదీతో మరోసారి రాజ్ నాథ్ చర్చలు జరుపుతారని తెలుస్తోంది.

Jammu And Kashmir
Pulwama
Narendra Modi
Rajnath Singh
Terrorists
Avantipura
  • Loading...

More Telugu News