Ayyanna Patrudu: అలాంటి వారే ఇలాంటి నీచులు: అవంతి శ్రీనివాస్ పై అయ్యన్నపాత్రుడు విసుర్లు

  • గంటకో పార్టీ మారే వ్యక్తుల గురించి మాట్లాడటం వేస్ట్
  • ఇలాంటి వారి వల్ల రాజకీయాలకు విలువ లేకుండా పోతోంది
  • పార్టీని నమ్ముకుని ఉండటం వల్లే నాకు ఇన్ని సార్లు మంత్రి పదవులు దక్కాయి

టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్ పై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. గంటకు ఒక పార్టీ మారే వ్యక్తుల గురించి మాట్లాడటం సమయాన్ని వృథా చేసుకోవడమేనని అన్నారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తులే ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడతారని చెప్పారు.

కష్ట కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందరూ అండగా ఉండాలని కోరారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా... ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. తరచూ పార్టీలు మారుతున్నవారి వల్ల రాజకీయాలకు విలువ లేకుండా పోతోందని అన్నారు. పార్టీని నమ్ముకుని ఉండటం వల్లే తనకు ఇన్ని సార్లు మంత్రి పదవులు లభించాయని చెప్పారు.

Ayyanna Patrudu
avanthi srinivas
Telugudesam
ysrcp
Chandrababu
  • Loading...

More Telugu News