Narendra Modi: నరేంద్ర మోదీతో సమావేశానికి నౌకాదళ, వాయుసేన చీఫ్ లు... కీలక నిర్ణయం!

  • మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ
  • గంట పాటు సాగిన భేటీ
  • హాజరైన పలువురు కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు

భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం దేశ అంతర్గత వ్యవహారాలు, కాశ్మీర్ లో భద్రత, పుల్వామా ఉగ్రదాడిపైనే చర్చించింది. దాదాపు గంట పాటు ఈ భేటీ జరుగగా, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలకు గట్టిగా బుద్ధి చెప్పాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

అంతకుమించిన వివరాలు, ప్రతీకారం తీర్చుకునే విధానంపై వివరాలు వెల్లడికానప్పటికీ, ఈ సమావేశానికి సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ తో పాటు భారత వాయుసేన, నౌకాదళ చీఫ్ ముఖ్య అధికారులు కూడా హాజరుకావడం గమనార్హం. హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, త్రివిధ దళాధిపతులు హాజరై పరిస్థితిని సమీక్షించారు.

  • Loading...

More Telugu News