Chandrababu: మా కుటుంబంలో పురందేశ్వరి బీజేపీలో, దగ్గుబాటి వైసీపీలో ఉన్నారు: చంద్రబాబు

  • కులాలు వేరు, పార్టీలు వేరు
  • అవంతికి తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి
  • బెదిరించి ఆయనను లొంగదీసుకున్నారు

తమ కుటుంబంలో పురందేశ్వరి బీజేపీలో, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో ఉన్నారని... బంధుత్వాలు వేరు, పార్టీలు వేరు అనే స్ఫూర్తి అందరిలో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్థానికంగా ఉండే పరిస్థితులు నేతలకు తెలుస్తుంటాయని... పార్టీకి నష్టం చేకూర్చే పనులు ఎక్కడ జరుగుతున్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కులాల మధ్య చిచ్చు పెట్టే పనులను ఆయా వర్గాల నేతలే ఖండించాలని అన్నారు. మొన్న తనతో కలసి ఢిల్లీలో తిరిగిన అవంతి శ్రీనివాస్... నిన్న వైసీపీలోకి వెళ్లారంటే ఏమనాలని ప్రశ్నించారు. అవంతికి తెలంగాణలో ఆస్తులు ఉన్నాయని... అందుకే ఆయనను బెదిరించి లొంగదీసుకున్నారని చెప్పారు. 

Chandrababu
purandeswari
daggubati
avanthi
Telugudesam
ysrcp
bjp
  • Loading...

More Telugu News