Andhra Pradesh: ఏపీలో శాంతిభద్రతలు రానురానూ క్షీణిస్తున్నాయి: వైసీపీ నేత మల్లాది విష్ణు

  • మహిళలపై తరచుగా దాడులు జరుగుతున్నాయి
  • ఏపీలో మహిళలకు భద్రత, భరోసా ఉన్నాయా?
  • శాంతి భద్రతల వైఫ్యలం స్పష్టంగా కనిపిస్తోంది

ఏపీలో శాంతిభద్రతలు రానురానూ క్షీణిస్తున్నాయని వైసీపీ నాయకుడు మల్లాది విష్ణు విమర్శించారు. జ్యోతి అనే మహిళ హత్యకు గురైన సంఘటన నేపథ్యంలో విష్ణు ఈ వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహిళలపై తరచుగా దాడులు జరుగుతున్నప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

 ఏపీలో మహిళలకు భద్రత, భరోసా ఉన్నాయా? అని ప్రశ్నించిన విష్ణు, గతంలో మహిళలపై దాడులు జరిగినప్పుడు గట్టిగా చర్యలు తీసుకున్నట్టయితే, ఈ రోజున ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదని అన్నారు. ఏపీలో శాంతి భద్రతల వైఫ్యలం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి గురించి ప్రస్తావించారు. ఈ ఘటనపై స్పందించకపోవడం  ఏపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
malladi vishnu
ys
  • Loading...

More Telugu News