Jammu And Kashmir: శ్రీనగర్ లో ఉగ్రవాదుల దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు

  • సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
  • అమరవీరుల కుటుంబాలకు నా సంతాపం 
  • గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలి 

జమ్ముకశ్మీర్ లో సీఆర్ఫీఎఫ్ వాహనంపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఖండించారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, అమరవీరుల కుటుంబాలకు తన సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఓ ట్వీట్ లో చంద్రబాబు పేర్కొన్నారు.

కాగా, ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. పుల్వామాలో జరిగిన ఘటనలో ముప్పై మంది జవాన్లు అమరులైన ఘటన హృదయాన్ని కలచివేస్తోందని అన్నారు. అమరవీరుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నానని, ఇలాంటి హింసాత్మక ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.





Jammu And Kashmir
pulwama
Andhra Pradesh
cm
Chandrababu
minister
Nara Lokesh
srinagar
  • Loading...

More Telugu News