kodela siva Prasad Rao: సేఫ్ కంపెనీ విషయమై ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: వైసీపీకి కోడెల సవాల్

  • అసాంఘిక చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదు
  • అరాచక శక్తులతో కలిసి వైసీపీ కుట్ర
  • అమాయక ప్రజలను రెచ్చగొడితే సహించబోము

సత్తెనపల్లిలో అరాచక శక్తులతో కలిసి వైసీపీ కుట్ర చేస్తోందని.. అసాంఘిక చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు హెచ్చరించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనకు సంబంధించిన సేఫ్ కంపెనీ విషయమై చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కోడెల సవాల్ విసిరారు. ఎన్నికల వేళ శవాల మీది పేలాలు ఏరుకుని తినే రాజకీయం చేస్తున్నారంటూ మండి పడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం అమాయక ప్రజలను రెచ్చగొడితే సహించేది లేదన్నారు.

kodela siva Prasad Rao
YSRCP
Telugudesam
Safe Company
Sathena pally
  • Loading...

More Telugu News