Jammu And Kashmir: ఉగ్రదాడుల ఘటనపై దర్యాప్తు జరుగుతోంది: సీఆర్పీఎఫ్ డీజీ భట్నాగర్
- ఘటనా స్థలికి ఉన్నతాధికారులు
- ఆసుపత్రులకు గాయపడ్డ జవాన్లు
- 78 వాహనాల శ్రేణిలో 2500 మంది జవాన్లు ఉన్నారు
జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడుల ఘటనపై దర్యాప్తు జరుగుతోందని సీఆర్పీఎఫ్ డీజీ భట్నాగర్ పేర్కొన్నారు. ఘటనా స్థలికి ఉన్నతాధికారులు వెళ్లారని, గాయపడ్డ జవాన్లను ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. జమ్ము నుంచి శ్రీనగర్ కు వెళుతున్న సీఆర్పీఎఫ్ కి చెందిన 78 వాహనాల శ్రేణిలో 2500 మంది జవాన్లు ఉన్నారని చెప్పారు. సెలవుల అనంతరం విధులకు హాజరయ్యేందుకు వారు వెళ్తుండగా ఈ దారుణం జరిగిందని అన్నారు.