CRPF: కశ్మీర్ లో ఉగ్రదాడి.. 18 మంది జవాన్ల మృతి!
- 2004 తరువాత అతిపెద్ద దాడి
- జమ్ము-శ్రీనగర్ హైవే మార్గంలో దాడి
- ఐఈడీ బాంబుతో దాడి.. కాల్పులు
35 మంది ప్రయాణిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై నేటి మధ్యాహ్నం ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డాయి. ఇది 2004 తరువాత జరిగిన అతిపెద్ద దాడి అని మిలటరీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనలో 18 మంది జవాన్లు అమరులయ్యారు. సీఆర్పీఎఫ్ 54వ బెటాలియన్‌కి చెందిన జవాన్లు జమ్ము -శ్రీనగర్ హైవే మార్గంలో ప్రయాణిస్తుండగా ఉగ్రమూకలు ఈ దాడికి పాల్పడ్డాయి.
మరోపక్క, ఈ దాడులకు పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ సంస్థ ప్రకటించింది. ముందుగా ఐఈడీ బాంబుతో దాడి జరపగా.. అనంతరం తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. పుల్వామా పాఠశాలలో బాంబు పేలుడు ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.