janasena: ‘జనసేన’ అధికారంలోకొస్తే పెనుగొండ ఊరు పేరు మారుస్తాం: పవన్ కల్యాణ్

- పెనుగొండలో శ్రీ వాసవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 90 అడుగుల విగ్రహం
జనసేన పార్టీ అధికారంలోకొచ్చాక పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ’గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన, కుంభాభిషేకం మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, పంచలోహాలతో తయారు చేసిన 90 అడుగుల అమ్మవారి విగ్రహానికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

