valantines day: వాలంటైన్స్ డే సందర్భంగా సంఘ్ పరివార్ నుంచి ఎలా తప్పించుకోవాలంటే!: యూత్ కు శశిథరూర్ సలహా

  • కామదేవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పండి
  • యువతీయువకులకు సూచించిన కాంగ్రెస్ నేత
  • మిశ్రమంగా స్పందిస్తున్న నెటిజన్లు

భారత్ లో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది యువతీయువకులు ఈరోజు ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇది భారతీయ సంస్కృతి కాదని హిందూ సంఘాలు చెబుతున్నాయి. ఈరోజు పార్కులు, పబ్బుల్లో కనిపిస్తే పెళ్లి చేసేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువతీ యువకులకు కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ మంచి సలహా ఇచ్చారు.

ఈరోజు శశిథరూర్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘హ్యాపీ వాలంటైన్స్ డే. ఓ ఫ్రెండ్‌తో కలిసి బయట తిరుగుతున్నందుకు సంఘ్ పరివార్ కుర్రాళ్లు మిమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నించవచ్చు. వారికి ప్రాచీన భారతీయ సంప్రదాయమైన కామదేవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పండి’ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు శశిథరూర్ వాదనకు మద్దతు పలుకుతుండగా, మరికొందరు మాత్రం కాంగ్రెస్ నేత తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు.

valantines day
Congress
sangh parivar
shasitharoor
Twitter
suggestion
  • Loading...

More Telugu News