Andhra Pradesh: చంద్రబాబుకు సిగ్గు లేదు.. పచ్చ మీడియాకు అసలే లేదు!: వైసీపీ ఎమ్మెల్యే రోజా

  • ఏపీ సీఎంపై ధ్వజమెత్తిన నగరి ఎమ్మెల్యే
  • ఊసరవెల్లికంటే వేగంగా రంగులు మారుస్తారని ఎద్దేవా
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. చంద్రబాబు ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చగలరని ఎద్దేవా చేశారు. ఆయన్ను సమర్థిస్తున్న పచ్చ మీడియాకు అసలే సిగ్గు లేదని దుయ్యబట్టారు.

ఈరోజు రోజా ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘అప్పుడు కాంగ్రెస్ పై చంద్ర గర్జన - ఇప్పుడు బీజేపీపై చంద్ర గర్జన.. ఊసరవెల్లి కంటే ఫాస్ట్ గా రంగులు మార్చగల, తన అవసరం కోసం ఎవరి చంకలో అయినా దూరే చంద్రబాబుకు సిగ్గులేదు. ఇక పచ్చ మీడియాకు అసలే లేదు’ అని ట్వీట్ చేశారు. ఓ తెలుగు దినపత్రిక క్లిప్పింగ్ లను ఈ ట్వీట్ కు రోజా జతచేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
yellow media
no shame
Twitter
YSRCP
roja
  • Loading...

More Telugu News