komaram bheem district: కొమరంభీమ్‌ జిల్లాలో రైల్వే వంతెన పనులు: ఆ రూట్‌లో పాసింజరు రైళ్లు రద్దు

  • నేడు, రేపు రైళ్లు నడవవని ప్రకటించిన అధికారులు
  • కాజీపేట-బల్లార్షా, భద్రాచలం-సిర్పూర్‌ టౌన్‌ రైళ్లు నడవవు
  • వేగం తగ్గించి నడవనున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

తెలంగాణ రాష్ట్రం కొమరంభీం జిల్లాలో ఓ రైల్వే వంతెన నిర్మాణ పనుల కారణంగా నేడు, రేపు పలు పాసింజరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగజ్‌నగర్‌-బెల్లంపల్లి-మందమర్రి మధ్య ఈ వంతెన పనులు చేపడుతున్నందున  14, 15 తేదీల్లో (గురు, శుక్రవారాల్లో) ఈ రద్దు అనివార్యమైందని అధికారులు తెలిపారు. అందువల్ల కాజీపేట-బల్లార్షా (57121), బల్లార్షా-కాజీపేట (57122) రామగిరి ప్యాసింజర్‌, భద్రాచలం-సిర్పూర్‌ టౌన్‌(57123), బల్లార్ష-భద్రాచలం(57124) ప్రయాణించే ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. అలాగే కాజీపేట్-బల్హార్ష (57121), బల్హార్ష-కాజీపేట్ (57122) రైలు కూడా రద్దయింది. కాగా న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లే పలు సూపర్‌పాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను  ఈ రెండురోజులు స్పీడ్‌ తగ్గించి నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News