Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ.. రక్తసిక్తమైన వైసీపీ ఆఫీసు!

- కోటబొమ్మాళిలో ఘటన
- టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య గొడవ
- వైసీపీ ఆఫీసులో ఫర్నీచర్, ఫైళ్లు ధ్వంసం
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేసుకున్నారు. జిల్లాలోని కోటబొమ్మాళి మండల కేంద్రంలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో నలుగురు వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడగా, బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.


