Andhra Pradesh: ప్రకాశం జిల్లా పొదిలి పంచాయతీ రాజ్ డీఈఈ రవిప్రకాశ్ ఇంట్లో ఏసీబీ సోదాలు!

  • బంధువుల ఇళ్లు, ఆఫీసులో తనిఖీలు
  • ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఆరోపణలు
  • ఇంకా కొనసాగుతున్న దాడులు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పొదిలి పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ రవిప్రకాశ్ ఇంటిపై ఏసీబీ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో అధికారులు ఒంగోలులోని సమతానగర్ లో ఉన్న రవిప్రకాశ్ ఇంటితో పాటు ఆఫీసుపై ఈరోజు ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అలాగే కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, పొదిలిలోని రవిప్రకాశ్ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఈ విషయమై ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. రవిప్రకాశ్ కు చెందిన ఇళ్లు, ఆఫీసు నుంచి పలు కీలక డాక్యుమెంట్లతో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయనీ, సాయంత్రం పూర్తి వివరాలు చెబుతామని అన్నారు.

Andhra Pradesh
Prakasam District
podili
panchayat raj DEE
ravi prakash
acb raids
  • Loading...

More Telugu News