Twitter: సైన్యానికి ఇంత కఠోర శిక్షణ... వీడియో షేర్ చేసిన ఆర్మీ అధికారి!

  • ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియో వైరల్
  • వీడియోను పెట్టిన ఏడీజీ-పీఐ
  • బెల్గాం కమాండో ట్రైనింగ్ స్కూల్ దృశ్యాలు

భారత సైనికులకు ఎటువంటి కఠోరమైన శిక్షణ ఇస్తారన్న విషయాన్ని చూపిస్తూ, రక్షణ మంత్రిత్వ శాఖలో అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి ఒకరు ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒకసారి శిక్షణ ముగించుకున్న కమాండోలు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా పోరాడగలుగుతారని చెబుతూ ఈ వీడియోను విడుదల చేశారు. బెల్గాంలోని కమాండో ట్రైనింగ్ స్కూల్ లో ఈ వీడియోను చిత్రీకరించారు.

నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ, కమాండో శిక్షణలో భాగంగా ఉండే కొన్ని క్లిప్స్ చూపించారు. ప్రత్యేక ఆపరేషన్స్ లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు, బందీలను రక్షించాల్సి వచ్చినప్పుడు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చినప్పుడు ఈ తరహా శిక్షణ ఎంతో ఉపకరిస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇక ఈ వీడియోలో ఫైరింగ్, స్కై డైవింగ్ తదితర దృశ్యాలున్నాయి. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.



  • Error fetching data: Network response was not ok

More Telugu News