Mukesh Ambani: అంబానీ వారి పెళ్లి పిలుపు... వెడ్డింగ్ కార్డు అ'ధర'హో!

  • పెద్ద బాక్స్ లో శుభలేఖ
  • బహుమతిగా వెండి ఫోటో ఫ్రేమ్
  • ఒక్కో శుభలేఖ ఖరీదు రూ. 1.50 లక్షలు

బోర్డ్ గేమ్ సైజులో బాక్స్, యానిమేటెడ్ రొటేటింగ్ డిస్క్, తాకగానే వెలిగే లైట్లు, శ్రీకృష్ణ, రాధల చిత్రం, వినాయకుడి ఎంబోజింగ్ ప్రతిమ... భారత అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహ శుభలేఖ రూపం ఇది. ఒక్కో శుభలేఖ ఖరీదు రూ. 1.50 లక్షల వరకూ ఉంటుందని తెలుస్తుండగా, దీని వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆకాశ్, శ్లోకల వివాహం వచ్చే నెల 9వ తేదీన జరగనుంది.

ఇక వెడ్డింగ్ కార్డును గులాబీరంగు బాక్స్ లో ఉంచి, పూలు, నెమళ్ల బొమ్మలతో దాన్ని అలంకరించారు. లోపల కృష్ణ, రాధల వెండి ఫోటో ఫ్రేమ్ ను కానుకగా ఉంచారు. ఇన్నర్ కంపార్ట్ మెంట్ ను ఓపెన్ చేస్తే, ఆరంజ్ రంగులోని కార్డుపై ఆహ్వాన పత్రిక కనిపిస్తుంది. 'సూర్యదేవుడు' ను తలచుకుంటూ అతిథులకు స్వయంగా సంతకాలు చేస్తూ ఆహ్వానాన్ని పలికారు నీతా, ముఖేశ్ లు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు. ఇటువంటి వెడ్డింగ్ కార్డును చూడటం జీవితంలో ఇదే తొలిసారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Mukesh Ambani
Akash Ambani
Wedding Card
Sloka Mehata
  • Loading...

More Telugu News