Andhra Pradesh: తోట త్రిమూర్తులు కుమారుడి వివాహం.. వధూవరులను ఆశీర్వదించిన నారా లోకేశ్!

  • ఘనంగా తోట పృథ్విరాజ్ వివాహ వేడుక
  • హాజరైన ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత

టీడీపీ నేత, రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కుమారుడు పృథ్విరాజ్ వివాహం అంగరంగవైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ కు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించారు. ఈరోజు లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘టీడీపీ నేత, రామచంద్రాపురం శాసనసభ్యులు తోట త్రిమూర్తులుగారి కుమారుడు తోట పృథ్విరాజ్ వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన పరిచయవేదిక వేడుకకు హాజరై వధూవరులకు అభినందనలు తెలియచేశాను’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Nara Lokesh
tota trimurthulu
Twitter
  • Loading...

More Telugu News