Lakshmi Parvati: సాక్షి టీవీ లైవ్ లో... 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రయిలర్ చూసి లక్ష్మీపార్వతి కన్నీరు!

  • 'సాక్షి'లో చర్చా కార్యక్రమం
  • ట్రయిలర్ లో ప్రతి సన్నివేశం వాస్తవం
  • 23 ఏళ్లయినా దేన్నీ మరువలేదన్న లక్ష్మీ పార్వతి

ఈ ఉదయం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రయిలర్ విడుదలైన నేపథ్యంలో తెలుగు వార్త చానెల్ 'సాక్షి'లో చర్చా కార్యక్రమం సాగగా, దీనిలో పాల్గొన్న లక్ష్మీపార్వతి, ట్రయిలర్ ను చూసి కన్నీరు పెట్టుకున్నారు. ట్రయిలర్ పై ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా, "నా కన్నీళ్లే స్పందన దానికి. చెప్పాలంటే.. ట్రయిలర్ లో చూపినంత వరకూ ప్రతి సన్నివేశాన్నీ వాస్తవంగా తీశారు. ప్రతి సన్నివేశం... ఏదీ నేను మరిచి పోలేదు. నా జీవితంలో జరిగింది. 23 ఏళ్లు అయినా... ప్రతిక్షణం, ప్రతిమాట, ప్రతి చర్యా గుర్తుంది నాకు. అవి గుర్తున్నాయి కనుకనే నేనీ విధంగా నిలబడివుండగలిగాను. నిజంగా వర్మగారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నిజంగా నన్నేమీ సంప్రదించలేదు. నన్ను ఆయన కలవలేదు. కనీసం మీరేమైనా చెబుతారా? అని నన్ను అడగలేదు" అని వ్యాఖ్యానించారు.

Lakshmi Parvati
Sakshi Tv
Lakshmis NTR
  • Loading...

More Telugu News