nagachaitanya: లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కలయికగా సాగే 'మజిలీ' .. టీజర్ రిలీజ్

  • చైతూ .. సమంతల 'మజిలీ'
  • డిఫరెంట్ లుక్స్ తో చైతూ
  • ఆకట్టుకునే సంభాషణలు

చైతూ .. సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' సినిమా రూపొందుతోంది. ఒక విభిన్నమైన ప్రేమకథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. దివ్యాన్శక్ మరో కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. క్రికెట్ లో చైతూ రాణిస్తుండటం .. ఆయన దివ్యాన్శక్ ప్రేమలో పడటం .. భార్య అయిన సమంతను దూరం పెట్టడం ఈ టీజర్లో చూపించారు.

'ఒక్కసారి పోతే తిరిగిరాదురా .. అది వస్తువైనా .. మనిషైనా ..' అనే రావు రమేశ్ డైలాగ్ .. 'నువ్వు నా రూము లోపలికి రాగలవేమో గానీ, నా మనసులోకి ఎప్పటికీ రాలేవు' అనే చైతూ డైలాగ్ .. 'వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలు దొరుకుతారని నువ్వే ప్రూవ్ చేశావ్' అనే పోసాని డైలాగ్ మనసుకు పట్టుకునేలా వున్నాయి. చైతూ క్లాస్ లుక్ తోను .. మాస్ లుక్ తోను కనిపిస్తున్నాడు. ఆయన ప్రియురాలిగా దివ్యాన్శక్ .. భార్యగా సమంత కనిపిస్తున్నారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ .. సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది.

nagachaitanya
samanta
  • Error fetching data: Network response was not ok

More Telugu News