Sreesanth: ‘సోదరి’ దీపికను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన శ్రీశాంత్.. ఎందుకో చెప్పిన క్రికెటర్!

  • తన భార్యపై అసభ్యకర కామెంట్లకు ఆమె అభిమానులే కారణమని అనుమానం
  • షోలో ఒకరికొకరు అండగా దీపిక-శ్రీశాంత్
  • అన్‌ఫాలో చేసి చర్చకు తెరలేపిన రన్నరప్

‘బిగ్‌బాస్’ టీవీ షోలో పాల్గొన్న క్రికెటర్ శ్రీశాంత్ తనకు అండగా నిలిచిన టీవీ నటి, దీపిక కకర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసి చర్చకు తెరలేపాడు. బిగ్‌బాస్ సీజన్ 12లో దీపిక విజేతగా నిలవగా, శ్రీశాంత్ రన్నరప్‌గా నిలిచాడు. షోలో ఇద్దరూ అన్నాచెల్లెళ్లలా ఎంతో సఖ్యంగా ఉన్నప్పటికీ దీపిక విజేత అయిన తర్వాత ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది.

షో ముగిసిన తర్వాత శ్రీశాంత్ భార్య భువనేశ్వరిపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు వెల్లువెత్తాయి. ఇది దీపిక అభిమానుల పనేనని భావించిన శ్రీశాంత్.. దీపికను దూరం పెడుతూ వచ్చాడు. తాజాగా, మీడియాతో మాట్లాడిన శ్రీశాంత్ దీపికను అన్‌ఫాలో చేసినట్టు చెప్పుకొచ్చాడు. దీపిక అభిమానులు తనను, తన భార్యను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. భార్య భువనేశ్వరి అంటే తనకు ఎనలేని ప్రేమ ఉందన్న శ్రీశాంత్ ఆమెను ఎవరైనా ఏమైనా  అంటే ఊరుకోబోనని పేర్కొన్నాడు. అందుకే దీపికను అన్‌ఫాలో చేసినట్టు వివరించాడు.  

దీపిక తనకు సోదరిలాంటిదని శ్రీశాంత్ పేర్కొన్నాడు. విభేదాలు షో వరకే పరిమితమన్నాడు. ఆమెతో రిలేషన్‌ను తాను గౌరవిస్తానన్నాడు. అయితే, తన భార్యను ఆమె అభిమానులు దూషిస్తున్నా ఆమె ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం వల్లే అన్‌ఫాలో చేసినట్టు శ్రీశాంత్ వివరించాడు.  

Sreesanth
unfollow
Dipika Kakar
Instagram
Cricketer
Bhuvneshwari
  • Loading...

More Telugu News