Avanthi Srinivas: లోటస్ పాండ్ కు అనకాపల్లి ఎంపీ... విశాఖ నేతలను వెంటనే రావాలని ఆదేశించిన జగన్!

  • ఏపీ రాజకీయం రసవత్తరం
  • నిన్న చీరాల ఎమ్మెల్యే టీడీపీకి రాజీనామా
  • నేడు అదే బాటలో అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్

సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. నిన్న తెలుగుదేశం పార్టీకి చీరాల ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా చేయగా, నేడు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ అదే దారిలో నడుస్తున్నారు. నేడు ఆయన హైదరాబాద్, లోటస్ పాండ్ కు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ కానున్నారు. ఆయనకు విశాఖపట్నం ఎంపీ స్థానం లేదా భీమిలి టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ముఖ్య నేతలను జగన్ హైదరాబాద్ కు పిలిపించారు. తొలుత వారితో మాట్లాడిన తరువాతనే అవంతి శ్రీనివాస్ తో జగన్ సమావేశం అవుతారని తెలుస్తోంది.

Avanthi Srinivas
Chirala
Anakapalli
YSRCP
Telugudesam
Jagan
  • Loading...

More Telugu News