Avanthi Srinivas: అనకాపల్లి టీడీపీ ఎంపీ పార్టీ మారుతున్నారంటూ ప్రచారం

  • తీవ్ర అసంతృప్తిలో అవంతి శ్రీనివాస్
  • అసెంబ్లీ విషయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు
  • ఎటూ తేల్చకపోవడంతో నిరాశ

అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ మారబోతున్నారంటూ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో అసెంబ్లీ సీటు విషయంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఇచ్చి హామీ విషయంలో ఎటూ తేల్చకపోవడంతో ఆయన  తీవ్ర నిరాశకు గురయ్యారని తెలుస్తోంది. ఇన్నాళ్లుగా తాను టీడీపీలో ఉన్నా పార్టీ చేసిందేమీ లేదంటూ అవంతి శ్రీనివాస్ సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం.

Avanthi Srinivas
Chandrababu
Anakapalli
Telugudesam
Assembly Seat
  • Loading...

More Telugu News