Chandrababu: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో భయపడ్డాను: నారా లోకేశ్

  • మరలా సీఎం కావడం ఖాయం
  • రాష్ట్రం అభివృద్ధి చెందటమూ ఖాయం
  • లోటు బడ్జెట్‌లో ఉన్నా అభివృద్ధి చేస్తున్నారు

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రాష్ట్రాన్ని ఏవిధంగా ముందుకు తీసుకుపోతామా? అని భయపడ్డానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. నేడు ఆయన పంచాయతీ గ్రామీణాభివృద్ధి సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. చంద్రబాబు మరలా సీఎం కావడం ఖాయమని.. రాష్ట్రం అభివృద్ధి మార్గంలో పయనించడమూ ఖాయమన్నారు.

రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా కూడా చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్టేనన్నారు. గడిచిన నాలుగేళ్లలో 24 వేల కిలో మీటర్ల సిమెంట్ రోడ్లు, 11 వేల కిలో మీటర్ల గ్రావెల్ రోడ్లు నిర్మించామని, అలాగే రాష్ట్రంలో 2,300 శ్మశానాలు అభివృద్ధి చేశామన్నారు.

Chandrababu
Nara Lokesh
Andhra Pradesh
Village Development
Cement Road
  • Loading...

More Telugu News