aamudalavalasa: తప్పకుండా తిరగబడతా.. కూన రవి కుమార్ ఎన్ని చెప్పినా వైసీపీ జెండా వదలను: వైసీపీ కార్యకర్త శివ

  • కూన రవికుమార్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చా 
  • ప్రాణాల మీదకొస్తే ఎవరైనా తిరగబడకుండా ఉండరు
  • చావనైనా చస్తా.., టీడీపీ జెండా మాత్రం పట్టుకోను

తిరిగి టీడీపీలోకి వచ్చేయని పక్షంలో ఏం చేయాలో అది చేస్తానంటూ శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన వైసీపీ కార్యకర్త శివను ఫోన్ ద్వారా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ బెదిరించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై మీడియాతో శివ మాట్లాడుతూ, కూన రవికుమార్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చానని, ప్రాణాల మీదకొచ్చినప్పుడు ఎవరైనా తిరగబడకుండా ఉండరని, తాను కూడా తప్పకుండా తిరగబడతానని అన్నారు.

కూన రవికుమార్ ఎన్ని మాటలు చెప్పినా వైసీపీ జెండాను తాను  వదలనని అన్నారు. చావనైనా చస్తానుగానీ, టీడీపీ జెండా పట్టుకుని మాత్రం తిరగనని వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యవహారం విషయమై న్యాయపరంగా ఏ స్థాయికైనా వెళతామని, చట్టపరంగా అతన్ని కోర్టులో నిలబెడతామని పొందూరు ఎంపీపీ, వైసీపీ నాయకుడు గాంధీ అన్నారు. తమ పార్టీకి చెందిన ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా ఉపేక్షించమని, టీడీపీ అక్రమాలపై పోరాడతామని అన్నారు.

aamudalavalasa
ponduru
Telugudesam
kuna ravi kumar
YSRCP
shiva
mpp
gandhi
  • Loading...

More Telugu News