Raju Thodsam: మహారాష్ట్ర ఎమ్మెల్యే భార్యపై కొందరు వ్యక్తుల దాడి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

  • నాలుగు కార్లలో వచ్చారు
  • ఓ కారును నా కారుకు అడ్డంగా పెట్టారు
  • 30-40 మంది వరకూ ఉంటారు

ఎమ్మెల్యే భార్యను కొందరు మహిళలు కొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని ఆర్ని ఎమ్మెల్యే రాజు తోడ్సాం భార్య ప్రియా షిండేపై మంగళవారం కొందరు మహిళలు సహా కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అందులో ఒక మహిళ ప్రియను చెప్పుతో కొట్టింది. ఒక కార్యక్రమానికి హాజరైన రాజు, ప్రియ, ఇతర మిత్రులతో కలిసి ఇంటికి తిరిగి రాగానే ఈ ఘటన జరిగింది. తనను కూడా కొట్టారంటూ రాజు వెల్లడించారు.

ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయమై ప్రియా షిండే మాట్లాడుతూ.. అంతా నాలుగు కార్లలో వచ్చారని.. అందులో ఓ కారును తన కారుకు అడ్డంగా పెట్టారని ప్రియ తెలిపారు. మొత్తం 30 - 40 మంది వరకూ ఉన్నారని తెలిపారు. రాజు మాజీ భార్య అర్చన తన బంధువులతో కలిసి దాడి చేసినట్టు ప్రియా షిండే తెలిపారు. రాజు మాట్లాడుతూ.. కొందరు వచ్చి తనను, తన భార్యను కొట్టారని తెలిపారు. తాను ఓ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానని.. తనకు గాయాలవడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందన్నారు.  

Raju Thodsam
Priya Shinde
Archana
Maharastra
Arni
  • Loading...

More Telugu News