balakrishna: ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ చిన్నల్లుడు భరత్

  • తాతగారి ఆశయాలతో ప్రజాజీవితంలోకి రావాలనుకుంటున్నా
  • పార్టీ ఆదేశిస్తే విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తా
  • ఆంధ్ర స్వరాంధ్ర కావాలంటే టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలి

సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ రాజకీయాల్లోకి రావడానికి ఉత్సాహం చూపుతున్నారు. టీడీపీ సీనియర్ నేత, దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీభరత్. ఈరోజు విశాఖపట్నంలో మీడియాతో భరత్ మాట్లాడుతూ, తాతగారి ఆశయాలు, ఆలోచనలతో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రజాజీవితంలోకి రావాలనుకుంటున్నానని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర కావాలంటే తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని చెప్పారు. అమరావతి, పోలవరంలాంటి కీలక ప్రాజెక్టులను పూర్తి చేయగల సమర్థత ఉన్న నాయకుడు చంద్రబాబేనని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు.

balakrishna
Chandrababu
sri bharath
Telugudesam
elections
  • Loading...

More Telugu News