rajamouli: రాజమౌళి సినిమాను అజయ్ దేవగణ్ అందుకే ఒప్పుకున్నాడట

  • షూటింగు దశలో రాజమౌళి సినిమా 
  • కథను మలుపు తిప్పే పాత్ర
  •  'ఈగ' హిందీ వెర్షన్ నుంచి మంచి సాన్నిహిత్యం 

ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి ఒక భారీ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ఎన్టీఆర్ బందిపోటుగా .. చరణ్ పోలీస్ ఆఫీసర్ గా  ఈ సినిమాలో కనిపించనున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం సముద్రఖనిని .. ప్రియమణిని ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక అజయ్ దేవగణ్ ను తీసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

తనకి రాని భాషలో నటించడం అజయ్ దేవగణ్ కి ఇష్టం వుండదు. ఈ కారణంగానే ఆయన 'భారతీయుడు 2' నుంచి వచ్చిన ఆఫర్ ను కూడా సున్నితంగా తిరస్కరించాడు. అయితే రాజమౌళి మాత్రం .. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ పాత్ర కథను మలుపు తిప్పేది అవుతుందనీ, తెరపై కొన్ని నిమిషాలు మాత్రమే కనిపిస్తుందని చెప్పి ఒప్పించాడట. 'ఈగ' హిందీ వెర్షన్ కి డబ్బింగ్ చెప్పింది అజయ్ నే. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన రాజమౌళి సినిమాను అజయ్ దేవగణ్ చేయడం ఖాయమైపోయిందనే అంటున్నారు. 

rajamouli
ajay devgn
  • Loading...

More Telugu News