amanchi: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవడానికి కారణం ఇదే: ఆమంచి

  • ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి జగన్
  • అందుకే ఆయన నాయకత్వంలో పని చేయాలనుకుంటున్నా
  • టీడీపీ తరపున నేను గెలవలేదు.. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు

తెలుగుదేశం పార్టీకి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితమే వైసీపీ అధినేత జగన్ ను ఆయన కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, దివంగత రాజశేఖరరెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి అని... జగన్ లో కూడా అవే లక్షణాలు ఉన్నాయని... అందుకే జగన్ నాయకత్వంలో పని చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. మంచిరోజు చూసుకుని వైసీపీలో చేరతానని తెలిపారు. జగన్ వద్ద తాను ఎలాంటి షరతులు పెట్టలేదని... రాష్ట్ర అభివృద్ధిపైనే ఇద్దరం చర్చించామని అన్నారు. తన గురువు రోశయ్యను కలిశానని... నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి అని ఆయన సూచించారని తెలిపారు. తాను టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందలేదని... అందుకే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని చెప్పారు.

amanchi
jagan
ysr
ysrcp
Telugudesam
  • Loading...

More Telugu News