kcr: కేసీఆర్ కు చెడ్డ పేరు తెచ్చే విధంగా హరీశ్ రావు రాజకీయ కోణం ఉంది: జగ్గారెడ్డి

  • సింగూరు నీటిని దోపిడీ చేశారు
  • శ్రీరాంసాగర్ కు అక్రమంగా నీటిని తరలించారు
  • సంగారెడ్డి ప్రజలకు హరీశ్ క్షమాపణలు చెప్పాలి

టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. సింగూరు నీటిని దోపిడీ చేసి సంగారెడ్డి ప్రజల గొంతులను హరీశ్ ఎండబెట్టారని అన్నారు. కేటాయింపులు లేకపోయినా శ్రీరాంసాగర్ కు నీటిని తరలించారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబసభ్యుడు కావడంతో హరీశ్ కు అధికారులు కూడా అడ్డు చెప్పలేదని అన్నారు.

ఈ విషయం కేసీఆర్ కు తెలిసి ఉంటే నీటి తరలింపుకు ఒప్పుకుని ఉండేవారు కాదని చెప్పారు. కేసీఆర్ కు చెడ్డ పేరును తీసుకొచ్చేలా ఈ నిర్ణయం ఉందని... దీని వెనుక హరీశ్ రాజకీయ కోణం ఉందనే అనుమానం తనకు ఉందని అన్నారు. ఇలాంటి విషయాలను అడుగుతాననే తనను ఓడించేందుకు హరీశ్ యత్నించారని దుయ్యబట్టారు. సంగారెడ్డి ప్రజలకు హరీశ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

kcr
Harish Rao
jagga reddy
sangareddy
TRS
congress
  • Loading...

More Telugu News