sameera reddy: నిన్ను త్వరగా కలుసుకోవాలని ఎదురు చూస్తున్నా బేబీ: సమీరారెడ్డి

  • మరోసారి తల్లి కోబోతున్న సమీరారెడ్డి
  • 2014లో అక్షయ్ వాద్రాను పెళ్లాడిన బాలీవుడ్ భామ
  • తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సమీరారెడ్డి

పలు తెలుగు చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటి సమీరారెడ్డి మరోమారు తల్లి కాబోతోంది. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. తాజాగా గర్భిణిగా ఉన్న తన ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆమె పంచుకుంది. ఫొటోకు... 'నిన్ను త్వరగా కలుసుకోవాలని ఎదురు చూస్తున్నా బేబీ' అంటూ క్యాప్షన్ పెట్టింది.

టాలీవుడ్ లో 'నరసింహుడు', 'అశోక్', 'జై చిరంజీవ' తదితర చిత్రాల్లో సమీరారెడ్డి నటించింది. అక్షయ్ వాద్రాను 2014లో పెళ్లాడింది. 2015లో వీరికి తొలి సంతానం కలిగింది. జూలైలో తాను మరో బిడ్డను కనబోతున్నానని తాజాగా ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది.

sameera reddy
bollywood
tollywood
pregnant
  • Loading...

More Telugu News