నా పరిస్థితి అత్యాచార బాధితురాలిలా తయారైంది: కర్ణాటక స్పీకర్ వివాదాస్పద వ్యాఖ్యలు
- వివాదాస్పద ఆడియో టేప్‌ను బయటపెట్టిన సీఎం
- సభలో వాడివేడి చర్చ
- తన పరిస్థితి దారుణంగా తయారైందని వాపోయిన స్పీకర్
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఈ ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప-జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్‌గౌడ కంద్‌కూర్ కుమారుడు శరణగౌడ మధ్య జరిగిన సంభాషణ ఇందులో రికార్డు అయింది. మంగళవారం మొత్తం అసెంబ్లీలో ఇదే విషయమై వాడివేడిగా చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలో స్పీకర్ మాట్లాడుతూ తన పరిస్థితి రేప్ బాధితురాలిలా తయారైందన్నారు. ఎవరో ఏదో చేస్తే దానికి తనను రోడ్డు మీదికి తీసుకురావడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.