Mahesh Babu: సుకుమార్ తో కాదు .. అనిల్ రావిపూడితో మహేశ్ బాబు నెక్స్ట్ మూవీ?

  • 'మహర్షి' షూటింగుతో బిజీగా మహేశ్ బాబు
  • 6 నెలల సమయం కోరిన సుకుమార్
  • రంగంలోకి దిగుతోన్న అనిల్ రావిపూడి  

ప్రస్తుతం మహేశ్ బాబు .. తన 25వ సినిమాగా 'మహర్షి' చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకోవడంతో, తన తదుపరి సినిమాపై మహేశ్ బాబు దృష్టి పెట్టాడు. సుకుమార్ తో తన తదుపరి సినిమా చేయాలని మహేశ్ బాబు భావించాడు. అయితే సుకుమార్ సిద్ధం చేసిన కథ నచ్చకపోవడంతో, ఆయన మరోలైన్ వినిపించి ఓకే చేసుకున్నాడని సమాచారం.

ఈ కథకి పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయడానికి తనకి 6 నెలలు సమయం కావాలని సుకుమార్ అడగడంతో, ఈ లోగా మరో దర్శకుడితో మరో సినిమా చేసేయాలనే నిర్ణయానికి మహేశ్ బాబు వచ్చేశాడని అంటున్నారు. ఇంతకుముందే ఆయనకి అనిల్ రావిపూడి ఒక కథను వినిపించి ఓకే చేయించుకున్నాడు. పూర్తి స్క్రిప్ట్ ను  సిద్ధం చేసి రంగంలోకి దిగిపొమ్మని ఆయనతో మహేశ్ బాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఆ పనిలోనే వున్నాడనేది ఫిల్మ్ నగర్ టాక్.

Mahesh Babu
anil ravipudi
  • Loading...

More Telugu News