Raghavendra Rao: రాజశేఖర్ రెడ్డిగారి ఆశయాలను అద్భుతంగా తెరకెక్కించారు: 'యాత్ర'పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రశంసలు

  • విజయవంతంగా నడుస్తున్న 'యాత్ర'
  • సినిమాను తిలకించిన రాఘవేంద్రరావు
  • మమ్ముట్టి ఆ పాత్రలో జీవించారు

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, దాదాపు రెండు దశాబ్దాల అనంతరం చేసిన తెలుగు చిత్రం 'యాత్ర' విజయవంతంగా నడుస్తుండగా, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, ఈ చిత్రాన్ని చూసి, నిర్మాతలు, దర్శకుడిపై అభినందనల వర్షం కురిపించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

సినిమా చూసిన తరువాత తన ఫేస్ బుక్ ఖాతాలో రాఘవేంద్రరావు స్పందిస్తూ, "యాత్ర చూశాను. దర్శకుడు మహి, రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. మమ్ముట్టి ఆయన పాత్రలో జీవించారు. నిర్మాతలు విజయ్ మరియు శశికి, వారి చిత్ర యూనిట్ కి నా కృతజ్ఞతలు" అని వ్యాఖ్యానించారు.

Raghavendra Rao
Yaatra
Mammutty
  • Loading...

More Telugu News