Mahesh Anand: ఒక్కసారి నిన్ను చూడాలనివుంది... మరణించే ముందు సినీ నటుడు మహేశ్ ఆనంద్ హృదయ విదారక పోస్ట్!

  • అత్యంత దయనీయ స్థితిలో మహేశ్ ఆనంద్ మృతదేహం
  • మరణానికి కొంతకాలం ముందు పోస్ట్
  • చనిపోయేముందు వచ్చి కలవాలని ఆకాంక్ష

అత్యంత దయనీయ స్థితిలో తన అపార్ట్ మెంట్ లో కుళ్లిపోయిన స్థితిలో కనిపించిన బాలీవుడ్ విలన్ మహేశ్ ఆనంద్ మృతదేహం, పలువురు సెలబ్రిటీలను, అభిమానులను కదిలించి వేయగా, ఆయన మరణించే ముందు తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ ను ఆయన తన కుమారుడు త్రిసూల్ ఆనంద్ ను ఉద్దేశించి పోస్ట్ చేశారు.

"త్రిసూల్... గాడ్ బ్లెస్ యూ మై సన్. నేను మరణించే ముందు కనీసం ఒక్కసారి వచ్చి దగ్గరికి తీసుకో. జీవితాంతం నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను" అంటూ పోస్ట్ చేశారు. ఇదే మెసేజ్ ఇచ్చేలా ఉన్న ఓ పాటను కూడా షేర్ చేశారు. కాగా, మహేశ్ ఆనంద్, ఆయన రెండో భార్య ఎరికా డిసౌజా దంపతులకు త్రిసూల్ జన్మించాడు. త్రిసూల్ చాలా కాలంగా తన తండ్రిని కలవలేదు. మహేశ్ కు దూరమైన తరువాత ఎరికా మరో వివాహం చేసుకుని త్రిసూల్ ను అతని తండ్రితో కలవనీయలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

Mahesh Anand
Facebook
Post
Trisool Anand
  • Loading...

More Telugu News