Pawan Kalyan: జనసేన టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న పవన్.. వడపోత కమిటీకి దరఖాస్తు సమర్పణ

  • సమావేశమైన జనసేన పీఏసీ
  • టికెట్ కోసం తొలి దరఖాస్తు సమర్పించిన పవన్
  • ప్రజారాజ్యం అనుభవాల దృష్ట్యా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన

రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి దింపే అంశంపై పవన్ అధ్యక్షతన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) మంగళవారం చర్చించింది. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై సమాలోచనలు చేసింది. ఈ సందర్భంగా అభ్యర్థుల వడపోత కమిటీకి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. అభ్యర్థులను ఎలా ఎంపిక చేయాలన్న దానిపై తీవ్రంగా చర్చించిన కమిటీ కొన్ని అంశాలను ఖరారు చేసింది.

పార్టీపట్ల నిబద్ధత, కష్టపడే తత్వం ఆధారంగా అభ్యర్థిత్వాలు ఖరారు చేయాలని చెప్పిన పవన్.. తన బయోడేటాను కూడా వడపోత కమిటీకి సమర్పించి పార్టీ టికెట్ అభ్యర్థించడం విశేషం. ప్రజారాజ్యం పార్టీ విషయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఎక్కడా డబ్బు ప్రస్తావన రాకుండా చూసుకోవాలని కమిటీకి పవన్ సూచించారు. టికెట్ అభ్యర్థించే వారు ఐదుగురు సభ్యుల కమిటీకి తప్ప మరెవరికీ దరఖాస్తులు సమర్పించవద్దని కోరారు.

Pawan Kalyan
Jana sena
Andhra Pradesh
Elections
pary ticket
praja Rajyam
  • Loading...

More Telugu News