kolkata-hyderabavisakha: కోల్ కతా - హైదరాబాద్ విమానంలో ప్రయాణికుడి మృతి.. విశాఖలో అత్యవసర ల్యాండింగ్!

  • కోల్ కతాకు చెందిన ప్రయాణికుడు కార్తీక్ చందన ఘోష్
  • కాలేయ సంబంధిత వ్యాధితో మృతి
  • విశాఖలో ఆయన బంధువులకు మృతదేహం అప్పగింత

కోల్ కతా నుంచి హైదరాబాద్ వెళ్లే ఇండిగో విమానాన్ని అత్యవసరంగా విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో దింపారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు.. ఈ విమానంలో కోల్ కతాకు చెందిన ప్రయాణికుడు కార్తీక్ చందన ఘోష్ (54) ప్రయాణిస్తున్నాడు. కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మృతి చెందాడు. దీంతో, విమానాన్ని అత్యవసరంగా విశాఖలో దింపి, ఘోష్ మృతదేహాన్ని విశాఖలోని ఆయన బంధువులకు అప్పగించినట్టు సమాచారం. అనంతరం, ఈ విమానం తిరిగి హైదరాబాద్ కు బయలు దేరి వెళ్లింది. 

kolkata-hyderabavisakha
Indigo
d
emergency landing
kathik chandana ghosh
  • Loading...

More Telugu News