Vote ki note: ఓటుకు నోటు కేసులో కొనసాగుతున్న ఈడీ విచారణ

  • కాంగ్రెస్ నేత నరేందర్ రెడ్డి, కొడుకు కీర్తన్ ల విచారణ
  • సుమారు ఆరు గంటల నుంచి కొనసాగుతున్న విచారణ
  • వీళ్లిద్దరినీ వేర్వేరుగా విచారిస్తున్న అధికారులు 

ఓటుకు నోటు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ ముందు కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి, అతని కుమారుడు కీర్తన్ రెడ్డి హాజరయ్యారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రాశేఖర్ ఆధ్వర్యంలో నరేందర్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

 స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ.50 లక్షలతో పాటు మిగిలిన రూ.4.5 కోట్లకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంకు స్టేట్ మెంట్స్, ఏసీబీ ఇచ్చిన ఆధారాలను వారి ముందు ఉంచినట్టు తెలుస్తోంది. కాగా, సుమారు ఆరు గంటలకు పైగా నరేందర్ రెడ్డి, కీర్తన్ రెడ్డిల విచారణ కొనసాగుతోంది. వీరిద్దరినీ వేర్వేరుగా అధికారులు విచారణ చేస్తున్నారు. ఏసీబీ చార్జిషీట్ ఆధారంగా నిందితులందరినీ విచారించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Vote ki note
ED
Congress
leader
vemu
narender reddy
keertan reddy
  • Loading...

More Telugu News