ఈ నెల 15న పట్టాలెక్కనున్న 'వందే భారత్' ఎక్స్‌ప్రెస్ రైలు.. టిక్కెట్ ధరలు ఖరారు!
- గంటకు 180 కి.మీ. వేగం
- మొదట్లో ‘ట్రైన్18’గా పిలిచేవారు
- మోదీ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోప్రారంభించారు
ఏసీ చైర్ కార్ టిక్కెట్ ధర రూ.1850 కాగా.. ఎగ్జిక్యూటివ్ తరగతి టికెట్ ధర రూ.3250 అని వెల్లడైంది. తిరుగు ప్రయాణంలో చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ టిక్కెట్లను రూ.1,795, రూ.3,470కి పొందవచ్చు. ఎగ్జిక్యూటివ్ తరగతిలో ఢిల్లీ నుంచి వారణాసికి ప్రయాణించే వారికి టీ, అల్పాహారం, భోజనానికి రూ.399, చైర్ కార్ టికెట్‌పై ప్రయాణించే వారు రూ.344 చెల్లించాలి. వారణాసి - ఢిల్లీకి ప్రయాణించే ఎగ్జిక్యూటివ్, చైర్ కార్ తరగతి వారు రూ.349, రూ.288 చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీ-వారణాసి మార్గంలో ప్రయాణించే శతాబ్ది రైళ్ల కన్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చైర్ కార్ ధర 1.5 రెట్లు, ఎగ్జిక్యూటివ్ తరగతి టిక్కెట్ ధర 1.4 రెట్లు అధికంగా ఉంది.