vikram: 300 కోట్ల బడ్జెట్ తో 'మహావీర్ కర్ణ' .. వేలమందితో యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ
- విక్రమ్ ప్రధాన పాత్రధారిగా 'మహావీర్ కర్ణ'
- కర్ణుడి వైపు నుంచి సాగే కథ
- విక్రమ్ కెరియర్లోనే ప్రత్యేకం
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక, రామాయణ మహాభారతాలను వెండితెరపై ఆవిష్కరించడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ తరహా సినిమాలలో చేయడానికి స్టార్ హీరోలు ముచ్చట పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళంలో విక్రమ్ కథానాయకుడిగా 'మహావీర్ కర్ణ' రూపొందుతోంది. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి ఆర్.ఎస్. విమల్ దర్శకత్వం వహిస్తున్నాడు.
టైటిల్ కి తగినట్టుగా .. 'మహాభారతం'లోని కర్ణుడి పాత్రను ప్రధానంగా చేసుకుని ఈ సినిమా సాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వేలాదిమంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షూటింగులో పాల్గొంటున్నారు. మహాభారత యుద్ధం 18 రోజులపాటు కొనసాగింది. ఈ యుద్ధంలో కర్ణుడి విశ్వరూప విన్యాసాన్ని అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. విక్రమ్ కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన చిత్రమవుతుందనేది అభిమానుల నమ్మకం.