priyanka gandhi: ప్రియాంక రోడ్ షోలో దొంగల పంట పండింది

  • లక్నోలో రోడ్ షో నిర్వహించిన ప్రియాంకగాంధీ
  • చేతివాటం ప్రదర్శించిన దొంగలు
  • కాంగ్రెస్ నేతల ఫోన్లను కూడా మాయం చేసిన చోరులు

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆమె రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. లక్నో నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీలో... 50 మంది ఫోన్లను దొంగలు తస్కరించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీషాన్ హైదర్ తో పాటు పలువురు నేతల ఫోన్లు చోరీకి గురయ్యాయి. ఒక దొంగను కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తమ ఫోన్లు పోయాయంటూ 50 మంది ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు, దొంగల కోసం అన్వేషిస్తున్నారు. సైబర్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

priyanka gandhi
road show
lucknow
cell phones
theft
  • Loading...

More Telugu News