Bigg boss: బిగ్ బాస్ షోలో లైంగికంగా వేధించారు: మహిళా కమిషన్ కు కవితా గౌడ ఫిర్యాదు

  • కన్నడ బిగ్ బాస్ లో పాల్గొన్న కవితా గౌడ
  • యాండీ వేధింపులకు దిగాడని ఆరోపణ
  • తప్పుడు ఆరోపణలేనంటున్న యాండీ

కన్నడ బిగ్ బాస్ పోటీల్లో పాల్గొని, మధ్యలోనే బయటకు వచ్చేసిన కవితా గౌడ, తన సహ కంటెస్టెంట్ యాండీపై సంచలన విమర్శలు చేసింది. హౌస్ లో యాండీ తనను లైంగికంగా హింసించాడని ఆరోపిస్తూ, ఆమె మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

షోలో జరిగిన వేధింపుల గురించి కార్యక్రమం నిర్మాత గురుదాస్ శణైకి ముందే చెప్పానని, తనకు జరిగిన అన్యాయంపై బయటకు వచ్చిన తరువాతనే నోరు విప్పుతున్నానని పేర్కొంది. షోలో భాగంగా రెండు రోజుల పాటు 'సూపర్‌ హీరో వర్సెస్‌ సూపర్‌ విలన్‌' టాస్క్‌ జరిగిన సమయంలో యాండీ లైంగిక వేధింపులకు దిగాడని ఆరోపించింది.

కాగా, కవితా గౌడ ఆరోపణలను యాండీ తీవ్రంగా ఖండించాడు. బిగ్‌ బాస్‌ పోటీల తరువాత ఆమెను తాను కలవలేదని అన్నాడు. ఓటమిని తట్టుకోలేక కవిత తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ప్రత్యారోపణలు చేశాడు.

Bigg boss
Kannada
Kavita Gowda
Sexual Harrasment
  • Loading...

More Telugu News