director bapineedu died: దర్శకుడు విజయబాపినీడు మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతాపం

  • విజయాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి అన్న కేసీఆర్‌
  • కుటుంబ కథలతో ఇంటిల్లిపాదిని ఆకట్టుకున్న దర్శకుడన్న చంద్రబాబు
  • బాపినీడు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన సీఎంలు

కుటుంబ కథా చిత్రాల ప్రముఖ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయబాపినీడు మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్‌లు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉత్తమ అభిరుచితో కుటుంబ కథాచిత్రాలు తీసి ఇంటిల్లిపాదిని ఆకట్టుకున్న కొద్దిమంది తెలుగు దర్శకుల్లో బాపినీడు ఒకరని చంద్రబాబునాయుడు కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పలు విజయవంతమైన చిత్రాలను తీయడమేకాక, ‘విజయ’ అనే మాసపత్రికను నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు చిరస్మరణీయులని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే పలు చిత్రాలు అందించి ఆకట్టుకున్నారని అన్నారు.

director bapineedu died
Chandrababu
KCR
  • Loading...

More Telugu News