jagan: ఏపీ ఎన్నికల్లో జగన్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది: టీఆర్ఎస్ నేత రసూల్ ఖాన్

  • ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగానే ఈ మద్దతు ఉంటుంది
  • జగన్ లౌకికవాది, పేద ప్రజల సన్నిహితుడు
  • వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయం

త్వరలో ఏపీలో జరగనున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రసూల్ ఖాన్ తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగానే ఈ మద్దతు ఉంటుందని... జగన్ కు ఓటు వేయాలని తమ పార్టీ ఏపీ ప్రజలను కోరనుందని చెప్పారు. జగన్ లౌకికవాది, పేద ప్రజల సన్నిహితుడని అన్నారు. ఏపీలో నివాసముంటున్న తెలంగాణ ప్రజలు, వ్యాపార భాగస్వాములను వైసీపీకి ఓటు వేయాలని కోరుతామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత లౌకికవాద, ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని అన్నారు.

jagan
TRS
ysrcp
federal front
rasool khan
  • Loading...

More Telugu News