Rahul Gandhi: నవ్వులే నవ్వులు... నరేంద్ర మోదీని అనుకరించిన రాహుల్ గాంధీ... వీడియో వైరల్!

  • లక్నోలో కాంగ్రెస్ ర్యాలీ
  • నరేంద్ర మోదీని అనుకరించిన రాహుల్
  • అనిల్ అంబానీకి దోచిపెట్టారని విమర్శలు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కాంగ్రెస్ కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ బాధ్యతలు చేపట్టేందుకు వచ్చి, లక్నోలో ర్యాలీ నిర్వహించిన వేళ, పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్, నవ్వులు పూయించారు. మోదీ చెయ్యి ఎలా తిప్పుతారు? ఆయన శరీర కదలికలు ఎలా వుంటాయో అనుకరిస్తూ చూపించారు.

"గతంలో నరేంద్ర మోదీ ఇలా మాట్లాడేవారు... ఇలా... ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు" అంటూ మోదీ హావభావాలను అనుకరించే ప్రయత్నం చేశారు. "సోదర సోదరీమణులారా... అనిల్ అంబానీ ఎవరో నాకు తెలియదు. ఆయనకు నేను ఎన్నడూ 20 వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదు" అని ఆయన అంటున్నారని ఎద్దేవా చేశారు. కాగా, రాహుల్ గాంధీ ప్రధానిని అనుకరించడం ఇదే తొలిసారేమీ కాదు. ఇటీవల తన భోపాల్ పర్యటన సందర్భంగానూ ఆయన మోదీ గొంతును మిమిక్రీ చేశారు. తాజా వీడియోను మీరూ చూడవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News