bay of bengal: బంగాళాఖాతంలో భూకంపం...చెన్నై నగరాన్ని తాకిన ప్రకంపనలు

  • అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో కదలికలు
  • ఉలిక్కిపడి పరుగులు తీసిన జనం
  • ఉదయం నుంచి వర్షంతో వెంటాడిన సునామీ భయం

అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయం...అంతా మంచి నిద్రలో ఉండగా హఠాత్తుగా చిన్న ప్రకంపన...ఏం జరిగిందో అర్థం చేసుకునేలోగానే కదలికలు...ఉలిక్కిపడ్డ జనం ఇళ్లు వదిలి బయటకు పరుగుతీశారు. బంగాళాఖాతంలో మంగళవారం తెల్లవారు జామున వచ్చిన స్వల్ప భూకంపం ప్రకంపనలు చెన్నై నగరంపై ప్రభావం చూపడంతో జనం ఉలిక్కిపడ్డారు. అర్ధరాత్రి తర్వాత భూమి కంపించిందని, రిక్టర్‌ స్కేల్‌పై 4.9గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే విభాగం తెలిపింది.

 చెన్నై నుంచి 609 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి అత్యంత లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. ఉదయం నుంచి చెన్నైలో తేలికపాటి వర్షాలు కురుస్తుండడం నగర వాసుల్లో మరింత ఆందోళనకు కారణమైంది. ఓవైపు భూకంపం, మరోవైపు వర్షాలతో ఎక్కడ సునామీ వస్తుందో అని భయపడ్డారు. భూకంపం ప్రభావం బంగ్లాదేశ్‌పై ఎక్కువ ఉందని, అయితే, సునామీ వంటి ప్రమాదమేదీ లేదని అధికారులు తేల్చిచెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

bay of bengal
earthquake
chennai
  • Loading...

More Telugu News