varalakshmi sarath kumar: ఉత్కంఠను రేపుతోన్న 'నాగకన్య' ట్రైలర్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-b0e606f25045333a2151ba8c12e84b9a650a68c4.jpg)
- పాము నేపథ్యంలో సాగే కథ
- ఆసక్తిని రేకెత్తిస్తోన్న సన్నివేశాలు
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
తమిళంలో 'నీయా' పేరుతో ఒక సినిమాను రూపొందిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ .. రాయ్ లక్ష్మి .. కేథరిన్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇక హీరో 'జై' ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. నాగుపాము నేపథ్యంలో సాగే ఈ సినిమాను తెలుగులో 'నాగకన్య' పేరుతో విడుదల చేయనున్నారు. సురేశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు.
ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది. కేథరిన్ ను నాగుపాము వెంటాడటం .. పామును 'జై' ప్రేమగా హత్తుకోవడం .. వరలక్ష్మి శరత్ కుమార్ .. రాయ్ లక్ష్మి పాములుగా మారిపోవడం .. ముగ్గురు కథానాయికలకు 'జై' తాళి కడుతుండటం .. శత్రువులపై పాము వరుసగా దాడి చేయడం .. 'పగటి వేళ ఆడపిల్లగాను .. రాత్రివేళ పాముగా బతకడం నా వలన కావడం లేదు" అంటూ నాయిక చెప్పే డైలాగ్ మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.